Thursday, 17 September 2026 11:02:25 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మవద్దు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి . గ్యాస్ బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు – అధికారులకు ఆదేశాలు.

Date : 13 March 2026 07:10 PM Views : 342

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజల్లో గందరగోళం సృష్టించేలా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అధికార యంత్రాంగం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సరిపడా ఎల్‌పీజీ గ్యాస్ అందుబాటులో ఉందని, బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా కొరత లేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్లే ప్రజల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అపోహలకు లోనై అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం 810 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండగా, రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోందని వివరించారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, మళ్లించడం, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడడం వంటి చర్యలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇటువంటి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశించారు.రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకొకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అపోహలు నమ్మకుండా ప్రభుత్వం గ్యాస్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. [7:02 pm, 13/3/2026] SIR: బ్రేకింగ్ వెబ్

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :