Sunday, 02 August 2026 05:30:45 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లాలో జనగణన పనులు సమగ్రంగా చేపట్టాలి - కలెక్టర్ అంకిత్

Date : 03 April 2026 04:22 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో జాతీయ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితమైన డేటా సేకరణ జరగాలని ఆయన అన్నారు . జాతీయ జనగణన కార్యక్రమం భాగంగా ఏప్రిల్ 1 నుండి 3 వరకు జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఫీల్డ్ ట్రైనర్స్‌కు మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడగా, ఫీల్డ్ స్థాయిలో పని చేసే సిబ్బందికి అవసరమైన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్స్‌గా ఎన్. శివరామకృష్ణ, డాక్టర్ పి. సుస్మిత రజిని పాల్గొని, మొత్తం 34 మంది ఫీల్డ్ ట్రైనీస్‌కు జనగణన నిర్వహణ విధానం, హౌస్ సెన్సెస్, డేటా సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ పద్ధతుల వినియోగం తదితర అంశాలపై విపులంగా శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా మూడవ రోజు పాలకోయ తండా ప్రాంతంలో ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనీస్‌ను అవుట్ ఫీల్డ్‌కు తీసుకెళ్లి, ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మొదటి ఇంటిలో హౌస్ సెన్సెస్ కార్యక్రమాన్ని కలెక్టర్ అంకిత్ IAS సమక్షంలో నిర్వహించారు. ఈ డెమో ద్వారా ఫీల్డ్ ట్రైనీస్‌కు ప్రత్యక్ష అనుభవం లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనలో సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమని అన్నారు . అందువల్ల ప్రతి వివరాన్ని శ్రద్ధగా నమోదు చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన సమాచారం అందిస్తూ డేటా సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ జిల్లా అధికార సిబ్బంది, సి.పి.ఓ. సంజీవరావు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణా కార్యక్రమం కొనసాగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :