Saturday, 19 September 2026 02:51:49 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం..* *జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..*

Date : 03 September 2024 09:21 PM Views : 756

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ఎంపీడీవోలు,తహసిల్దారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికలకు కేటాయించిన సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల విషయంలో స్థానికంగా పడిన గుంతలను పూడ్చాలని, అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని దీని విషయంలో పంచాయతీరాజ్ అధికారులు అంచనాలను రూపొందించాలన్నారు.భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు,సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా తొలగించాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే గ్రామాల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలన్నారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ పనులను చేపట్టి బ్లీచింగ్ పౌడర్ ను చల్లించాలన్నారు. గ్రామాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలతో పాటు ప్రధాన రహదారులకు పక్కన ఇంకుడు గుంతలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరో నాలుగైదు రోజులు వర్ష సూచన ఉన్నందున ముంపు ప్రాంతాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అటు గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ముంపు ప్రాంత మండలాల అధికారులు గర్భిణీ స్త్రీలు, వృద్ధులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని గమనిస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పునరావస కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు, పూర్తిగా దంసమైన ఇళ్లకు, చనిపోయిన పశువులకు,గేదెలకు ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం నష్టపరిహాన్ని బాధితులకు అందజేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,డీఆర్డీఓ విద్యా చందన, సిపిఓ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ డాకుసింగ్, డిసిహెచ్ రవిబాబు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, డిపిఓ చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :