Saturday, 19 September 2026 04:20:13 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

అంగన్వాడీ సిబ్బందికి ₹18,000 వేతనం హామీ అమలు చేయాలి – ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

Date : 12 June 2026 03:15 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ₹18,000 వేతనం పెంపు హామీని వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. పాల్వంచలోని సీఆర్ భవన్‌లో నిర్వహించిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ – ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షురాలు గోనే మణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నరాటి ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై రోజురోజుకూ అదనపు పనిభారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వేతనాల పెంపు, ఇంటి అద్దె భత్యం, గ్యాస్ బిల్లుల చెల్లింపులు వంటి సమస్యలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) విధులు సహా ఇతర అదనపు బాధ్యతల కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందువల్ల అంగన్వాడీ సిబ్బందికి అప్పగించిన BLO విధులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రీ-ప్రైమరీ పాఠశాలల పేరుతో అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను తగ్గించే విధానాలు అమలవుతున్నాయని, దీనివల్ల అంగన్వాడీ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని అన్నారు. అంగన్వాడీ టీచర్లలో 10 సంవత్సరాల సేవ పూర్తి చేసి డిగ్రీ, పీజీ అర్హతలు పొందిన వారికి ICDS శాఖలో గ్రేడ్–1 సూపర్వైజర్, CDPO, కార్యాలయ సిబ్బంది పోస్టులలో 30 శాతం రిజర్వేషన్ కల్పించి, ఆ పోస్టులను అంగన్వాడీ సిబ్బందితోనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ₹18,000 వేతనం వెంటనే అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దె, గ్యాస్ బిల్లులు మరియు ఇతర బకాయిలను విడుదల చేయాలి. అంగన్వాడీ సిబ్బందికి విధించిన BLO డ్యూటీలను రద్దు చేయాలి. అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను కాపాడే చర్యలు తీసుకోవాలి. 10 సంవత్సరాల సేవ పూర్తి చేసి ఉన్నత విద్యార్హతలు పొందిన అంగన్వాడీ సిబ్బందికి ICDS శాఖలో 30% పదోన్నతి రిజర్వేషన్ కల్పించాలి. ఈ సమావేశంలోజిల్లా అధ్యక్షులు గోనే మణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్. అన్నారపు వెంకటేశ్వర్లు, విజయ. శ్రీ లత.సావిత్రి, సుభాషిణి, వినోద. భారతి, నీరజ, సరోజని, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. ఇట్లు AITUC అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ నినాదం: “అంగన్వాడీ సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం – పదోన్నతి అవకాశాలు కల్పించాలి!” “ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి!”

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :