తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
Admin
తెలుగు వెలుగు టీవీ