తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకులకు రెండు భారీ పరిశ్రమలలో శిక్షణ & ఉపాధి అవకాశాలు – శనివారం (10వ తేదీ)న ఓరియంటేషన్ & సెలెక్షన్ : జిల్లా కలెక్టర్. మొత్తం పోస్టులు: 120 (RANE – 50 | MRF – 70) ఒరియంటేషన్ మరియు సెలెక్షన్ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల శనివారం (10వ తేదీ) ఉదయం 10 గంటలకు IDOC, పాల్వంచలో హాజరు కావాలని పిలుపు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యువకులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన Rane (Madras) Limited మరియు MRF Ltd. సంస్థలలో శిక్షణ మరియు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS తెలిపారు.ఈ రెండు కార్యక్రమాలను Lernern Pvt. Ltd. నిర్వహిస్తుండగా,యువకులకు పరిశ్రమలో ప్రత్యక్ష అనుభవం, నెలవారీ ఆదాయం మరియు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అమలు చేయబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 1) Rane (Madras) Limited – Student Trainee (B.Voc / D.Voc Scheme) పోస్టులు: 50.శిక్షణ స్థలం:సదాశివపేట ప్లాంట్, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో) అర్హత:10వ / 12వ / ITI వయస్సు: 18 – 28 సంవత్సరాలు, పురుషులు మాత్రమే.శిక్షణ కాలం: 2 సంవత్సరాలుపని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం) స్టైపెండ్ & లాభాలు:స్టైపెండ్: ₹13,800అటెండెన్స్ బోనస్: ₹1,300 మొత్తం ఆదాయం: ₹15,100 / నెలడిడక్షన్: ₹1,550 (క్యాంటీన్ & వసతి)చదువుతో పాటు పని (Learn & Earn) + వొకేషనల్ అర్హత (B.Voc / D.Voc). 2) MRF Ltd. – Apprentice (NAPS Scheme) పోస్టులు: 70.శిక్షణ స్థలం: సదాశివపేట, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో)అర్హత:10వ / 12వ / ITI వయస్సు: 18 – 28 సంవత్సరాలు పురుషులు మాత్రమే.శిక్షణ కాలం:2 సంవత్సరాలుపని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం)స్టైపెండ్ & లాభాలు:స్టైపెండ్: ₹16,500.అటెండెన్స్ బోనస్: ₹1,000 డిడక్షన్: ₹1,850 (క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, వసతి & భోజనం) ప్రభుత్వ అప్రెంటిస్ స్కీమ్ (NAPS)+ ఎక్కువ నెలవారీ ఆదాయం & సౌకర్యాలు. యువకులకు ముఖ్య సూచన: చదువుతో పాటు డిగ్రీ / డిప్లొమా అర్హత కావాలంటే → RANE ఎక్కువ ఆదాయం, మెరుగైన సౌకర్యాలు కావాలంటే → MRF ఓరియంటేషన్ & సెలెక్షన్ పై కలెక్టర్ గారి పిలుపు:రెండు అవకాశాలపై ఆసక్తి ఉన్న అర్హులైన యువకులు ఈ నెల శనివారం (10వ తేదీ) ఉదయం 10 గంటలకు IDOC, పాల్వంచలో నిర్వహించబడే ఒరియంటేషన్ మరియు సెలెక్షన్ కార్యక్రమానికితప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ:10 జనవరి 2026. సంప్రదించవలసిన నంబర్లు:9347353551, 7995806182.
Admin
తెలుగు వెలుగు టీవీ