Wednesday, 16 September 2026 05:05:04 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

70 లక్షల మొక్కలు నాటడమే వన మహోత్సవ లక్ష్యం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 May 2025 09:30 PM Views : 820

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2025-26 వన మహోత్సవంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులతో వనమహోత్సవం పై ఐటీడీఏ పీవో రాహుల్ మరియు అటవీశాఖాధికారి కృష్ణ గౌడ్ తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందని, దీనిలో భాగంగా అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతులకు, ఇంటి ఆవరణ, రహదారుల వెంట, కెనాల్ బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు, టీ జి ఎఫ్ డి సి శాఖకు 12 లక్షల మొక్కలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు. వన మహోత్సవంలో భాగంగా నాటే మొక్కలు ఎక్సైజ్ శాఖ అధికారులు తాటి మరియు ఈత చెట్లను నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మునగ మొక్కలు, అటవీశాఖ వెదురు మొక్కలు, విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో ఔషధ మొక్కలు అయినటువంటి తులసి, కరివేపాకు, ఉసిరి, మునగ మరియు వెలగ మొక్కలను నాటాలన్నారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న కెనాల్ బండ్ ప్లాంటేషన్ లో సుబాబులు మరియు వట్టివేర్లు మొక్కలు నాటాలన్నారు. ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ నర్సరీలలో టేకు, ఎర్రచందనం మరియు వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించటానికి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలని, వారికి కావలసిన మొక్కలను గ్రామీణ అభివృద్ధి సంస్థ నర్సరీ నుండి తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల త్రవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడం తో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్, ఇరిగేషన్ ఈ ఈ అర్జునరావు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :