Friday, 18 September 2026 04:17:37 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఫార్మసీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు--డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ సమ్మయ్య

Date : 25 November 2024 07:39 PM Views : 901

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీ అమూల్యమైన ఫార్మసిస్టు సర్టిఫికెట్ ను కిరాయికి ఇవ్వద్దు ప్రజల ప్రాణాలతో చెలగాటము ఆడవద్దు... శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా వచ్చిన బి.ఫార్మసీ మరియు ఫార్మా. డీ కోసం “ఓరియెంటేషన్ ప్రోగ్రామ్” నిర్వహించింది. ప్రొఫెసర్ (డా.). గాదె సమ్మయ్య, డీన్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసి కాకతీయ యూనివర్సిటీ ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. బి.ఫార్మసీ మరియు ఫార్మ్‌డి కోర్సు పూర్తి చేసిన తర్వాత వివిధ అవకాశాలు మరియు కెరీర్ ఎంపికలపై ఆయన హైలైట్ చేశారు. ఆచార్య సమ్మయ్య, డాక్టర్ బొంత విజయ్ కుమార్ గార్లు డాక్టర్ చిరంజీవి ప్రిన్సిపాల్ రచించినటువంటి మైక్రో బయాలజీ మరియు పాతో పిజియాలజీ అనే పుస్తకమును ఆవిష్కరించారు . ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఫార్మసీ సేవలు భారతదేశానికి తప్పనిసరి అని,ఎంతో అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. బీఫార్మసీ, ఎం. ఫార్మసీ ,ఫామ్. డి విద్యార్థుల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ,రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మకో విజిలెన్స్ ,డ్రగ్ ఇన్స్పెక్టర్ ,మ్యానుఫ్యాక్చర్ కెమిస్ట్ గా, మెడికల్ కోడింగ్ లో , ఫార్మకో విజిలెన్స్ కెమిస్ట్ గా, అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫార్మసీ వృత్తి యొక్క ప్రాముఖ్యత మరియు పరిధిని, మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యలు మరియు సర్టిఫికేట్ అద్దెకు సంబంధించిన అంశాలను వివరించాడు. పాఠ్యాంశాల్లోని వారి భావన ఆధారిత అభ్యాస ప్రక్రియపై అతను విద్యార్థులను ప్రేరేపించి, ప్రోత్సహించాడు. అతను విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కూడా సంభాషించడంతో సెషన్ ఉల్లాసంగా మారింది. సముచిత గౌరవంతో ముఖ్య అతిథిని అపారమైన మర్యాదలతో సత్కరించారు.

డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా మరియు ఫార్మసిస్టు సూచనలు లేకుండా మందులు వాడినచో ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా ఫార్మసిస్టు మరియు డాక్టర్ చేత చూపించబడిన మందులు వాడాలని ఫార్మసిస్ట్ గా మీరు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్ట్ యొక్క పాత్ర వెన్నుపూస వంటిదని వాక్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు తమ అమూల్యమైన ఫార్మసిస్టు సర్టిఫికెట్ను కిరాయికిచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరించారు. కిరాయికి ఇవ్వబడిన సర్టిఫికెట్ ద్వారా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఉల్లంఘన అవుతుందని ప్రొఫెసర్ గాదె సమ్మయ్య గారు తమ ఆవేదనను విద్యార్థుల ఎదుట వ్యక్తపరిచారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫార్మసీ సర్టిఫికెట్ కిరాయికి ఇచ్చి తమ అమూల్యమైన భవిష్యత్తుకు పెను ప్రమాదం తెచ్చుకుంటున్నారని బాధపడినారు. అనవసరంగా మరియు మోతాదుకు మించి మందులను వాడొద్దని ప్రజలకు ఈ వేడుకల ద్వారా సూచించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి విద్యార్థినీలు సైంటిఫిక్ విధానాన్ని అలవర్చుకొని కొత్త మందులు కనుగొనడంలో నిమగ్నం కావాలని, ఫార్మసిస్టుకు మందులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఫార్మసీ విద్యార్థులు రిటైల్ హోల్ సేల్ రంగంలో మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముందుకు కొనసాగాలని, ఫార్మసిస్టుకు పేషెంట్ కు పరోక్ష సంబంధం ఉంటుందని, డాక్టర్కు పేషెంట్ కు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని మరియు విదేశాల మాదిరిగా ఫార్మసిస్టు డాక్టర్ కలిసి ప్రజల ఆరోగ్య సంరక్షణలో పని చేస్తే భారతదేశంలో సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన సమాజాన్ని నిర్మించవచ్చని, విద్యార్థులకు తెలిపారు. మరియు చివరగా తన ప్రసంగంలో ఫార్మసిస్ట్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. తన దీవెనలు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.

విద్యార్థులు మానసిక ధైర్యం కలిగి చదువును ఆధారం చేసుకొని జీవించాలని సూచించారు విద్యార్థులు చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు కష్టపడి చదివి తల్లిదండ్రులను గురువులను గౌరవించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క విద్యా విధానాన్ని బుద్ధుని యొక్క ప్రవచనాలు అనుకరించి మంచి సమాజం కోసం పాటుపడాలని కోరుకొన్నారు ఆ తర్వాత హరితహారం ప్రోగ్రాము లో డాక్టర్ బొంత విజయ్ కుమారు మరియు ఆచార్య సమ్మయ్య పాల్గొని విద్యార్థిని అధ్యాపకులతో పాటు మొక్కలు నాటారు . మరొక అతిథిగా డాక్టర్ బొంత విజయకుమార్ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు విద్యార్థులకు చదువుతోపాటు సాఫ్ట్వేర్ స్కిల్స్ సాస్ సాబ్ లాంటి ప్రోగ్రామ్స్ పట్ల అవగాహన ఉండాలని సూచించారు వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :