Saturday, 19 September 2026 04:22:08 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు నాయకత్వం వహించాలి. నూతన సర్పంచులకు రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 17 February 2026 08:17 PM Views : 260

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామాల సమగ్రాభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు.నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్ఎం ఓల్డ్ క్యాంపస్)లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెండవ విడత శిక్షణ కార్యక్రమం 17-02-2026 నుండి 21-02-2026 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.రెండవ విడతలో భాగంగా అశ్వరావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచులు శిక్షణలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, పరిపాలన విధానాలు, బాధ్యతలు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.శిక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామపంచాయతీలకు అందుతున్న అభివృద్ధి పథకాల నిధులను సక్రమంగా వినియోగించి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిని సర్పంచులు నిరంతరం పర్యవేక్షించి చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందుతున్నదీ లేదో పరిశీలించాలని సూచించారు. అక్షరాస్యత పెంపు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.జిల్లాలో ఉన్న పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు పూబెల్లి, రోళ్ళపాడు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లోని కారుకొండ, జూలూరుపాడు ప్రాంతంలోని వ్యవసాయ విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేస్తే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు.సర్పంచులు పంచాయతీ శాఖకే పరిమితం కాకుండా గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇప్ప, ఇప్పపువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపద అభివృద్ధి, మేత సంపద పెంపుతో ప్రభుత్వ సబ్సిడీలుగ్రామాల్లో పొందే అవకాశముందని వివరించారు.18 నుండి 20 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా యంత్రాంగం నిర్వహించే ఇంటర్వ్యూలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సర్పంచులకు శిక్షణ కిట్లను అందజేశారు. గ్రామ పాలనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలు, చట్టపరమైన సూచనలు, అభివృద్ధి పథకాల సమాచార పత్రాలు తదితర అంశాలు కిట్లలో అందజేయబడినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్‌రత్ వలి, ఏపీవో రంగ, ఎస్‌బీఎం రేవతి, డిటిఎం సందీప్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :