Tuesday, 03 November 2026 04:15:25 PM
# భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి.

ఘనంగా దేశ తొలిమహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడకలు

Date : 10 March 2026 02:47 PM Views : 324

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా దేశ తొలిమహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడకలు : ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భానుప్రియ దేశ తొలిమహిళా ఉపాధ్యాయురాలు,సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి ఫూలే అని ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,న్యాయవాది సుంకర భానుప్రియ అన్నారు.మంగళవారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని కొత్తగూడెం న్యాయవాదుల లైబ్రరీ హాల్ నందు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఆమె మాట్లాడుతూ కుల,మత భేదాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారానే స్ర్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణి అని కొనియాడారు.సావిత్రిబాయి పూలే లక్ష్యలు,ఆశయాల్ని అచరించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని అధ్యయనం చేయాలని,దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలేనని చాటి చెప్పాలన్నారు.నేటి యువతి, యువకులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ,యెర్రా కామేష్,మల్లెల ఉష రాణి,అడపాల పార్వతీ,నీలవేణి,గోపీకృష్ణ,ఎర్రపాటి కృష్ణ,మారపాక రమేష్,నాగస్రవంతి,శ్వేత,స్వప్న,సంధ్యారాణి,పద్మకల,బేబీ షామిలి,హర్షిత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :