Wednesday, 16 September 2026 08:25:45 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పోలీసు ఉద్యోగాల కొరకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్

Date : 25 August 2026 05:40 PM Views : 513

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కొరకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్, 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ యువత సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలోని సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాలతో పాటు ఎస్పీఎఫ్ (SPF), జైళ్ల శాఖ (Prisons) మరియు ఫైర్ (Fire) విభాగాల్లో సుమారు 7,437 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల సాధనలో తోడ్పడేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వెల్లడించారు. జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాలకు చెందిన యువతి, యువకులకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కోచింగ్‌లో భాగంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రాత పరీక్షలకు సంబంధించిన శిక్షణతో పాటు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఫిజికల్ ట్రైనింగ్ ఉచితంగా అందించబడుతుందని తెలిపారు. అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించబడుతుందని చెప్పారు. పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు 26-08-2026 నుండి 31-08-2026 వరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వబడిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, విద్యార్హతలకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జతచేసి సమర్పించాలని సూచించారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, అర్హులైన మరియు ప్రతిభావంతులైన అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు 06-09-2026 (ఆదివారం) నాడు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం మరియు మణుగూరు పట్టణాలలో ప్రత్యేక స్క్రీనింగ్ టెస్ట్ (అర్హత పరీక్ష) నిర్వహించబడుతుందని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కోచింగ్ ప్రారంభ తేదీ, శిక్షణా కేంద్రం మరియు ఇతర పూర్తి వివరాలను అధికారికంగా మీడియా ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. సమాచారం కొరకు ఎస్బి ll ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మొబైల్ నెంబర్ 8712682013 సంప్రదించవలసినదిగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రమశిక్షణతో కృషి చేసి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. జిల్లా పోలీసు శాఖ అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్‌ను ప్రతి అభ్యర్థి వినియోగించుకోవాలని కోరుతున్నాను” అని ఆకాంక్షించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :