Tuesday, 03 November 2026 12:30:03 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అటవీ సంరక్షణ అందరి బాధ్యత - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 14 November 2025 04:19 PM Views : 366

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజనుల జీవనోపాధి అభివృద్ధితోనే అటవీ రక్షణ సాధ్యం. జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గిరిజనులు పోడు నరికకుండా చూడటం అత్యవసరమని, ఇందుకోసం వారికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పించడం కీలకమని చెప్పారు. జిల్లాలో గుత్తికోయ గిరిజనుల నివాస గుంపులు, వారి జనాభా, అవసరమైన సౌకర్యాలపై పూర్తి నివేదికలను సిద్ధం చేసి, ఆ నివేదికల ఆధారంగా వారికి తగిన ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ సంరక్షణ భవనాలను నిర్మించి వాటి ద్వారా గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గిరిజనులకు చేపల పెంపకం శిక్షణ, లైవ్లీహుడ్‌ షెడ్ల ఏర్పాటు వంటి జీవనోపాధి కార్యక్రమాలు చేపడితే పోడు నరికే పరిస్థితులు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జీవనోపాధి కల్పించిన తర్వాత కూడా ఎవరైనా పోడు నరికితే పీడీ యాక్ట్ అమలు చేయాలని హెచ్చరించారు. ఇప్పటికే నరికిన పోడు ప్రదేశాల్లో వెంటనే వెదురు మొక్కలు నాటాలని సూచించారు. జిసిసి ద్వారా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంపొందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్ప చెట్ల సర్వే నిర్వహించి, రాబోయే సీజన్‌లో ఒక్క ఇప్పపువ్వు కూడా వృథా కాకుండా నెట్‌లతో సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యమైన ఇప్పపువ్వుకు కిలోకు ₹2000 వరకు ధర లభిస్తుందని, తుమ్మజిగురు, శంకుపుష్పం వంటి విలువైన అటవీ ఉత్పత్తులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గుత్తికోయ యువతకు ఫర్నిచర్ తయారీ రంగంలో అవకాశాలు ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా శాఖలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో విస్తారమైన అటవీ భూభాగం ఉన్నందున, అటవీ చట్టాలను అనుసరిస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తుమ్మల చెరువు, కిన్నెరసాని, ఇల్లందు, రథం గుట్ట వంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కార్యక్రమాలు ప్రారంభించాలని, ముక్కోటి ఎకాదశి నాటికి ఐదు ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు అటవీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అటవీశాఖ వీరికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన అటవీ అనుమతులు, పెండింగ్ పనులు, అటవీ సంరక్షణ చర్యల పురోగతిపై సమీక్షించారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ కోసం శాఖ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందని, గిరిజనుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోడు ప్రదేశాలను గుర్తించి అక్కడ పునర్వనీకరణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ అటవీ భూముల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. పోడు నరికే సంఘటనలను త్వరితగతిన గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీ చట్టాల అమలులో ఇతర శాఖలతో సమన్వయం మరింత బలపడేలా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :