Thursday, 17 September 2026 08:14:34 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కార్పొరేషన్ ముసుగులో కాసుల వేటనా - మధ్యం పై మాట మార్చిన రేవంత్ రెడ్డి

Date : 01 December 2025 05:00 PM Views : 227

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ పుణ్యాన రోడ్డు ఎక్కిన వైన్స్ కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల అభివృద్ధి ఏమో కానీ మద్యం దుకాణాల షాపులు పెరిగాయని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయితీలను కార్పొరేషన్ పరిధిలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే,అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా చేశారని గతంలో మండలం మొత్తం కలిపి రెండు వైన్ షాపులు ఉంటే కార్పొరేషన్ పుణ్యమంటూ ఇప్పుడు వైన్ షాపులు నాలుగుకు చేరుకున్నాయన్నారు ఒక దుకాణం మరీ దారుణంగా కాలేజీకీ కూతవేటున ఏర్పాటు చేశారని ఇది సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామని,మద్యం అమ్మకాల పాలసీని మారుస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను సైతం అదే పంథాలో నడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం కెసిఆర్ హయాంలో 75 వేల మద్యం అమ్మకాలు మొదటి నాలుగు సంవత్సరాలలో జరిపితే మొదటి రెండు సంవత్సరాలలోనే 71 వేల కోట్ల మద్యం అమ్మకాలను జరిపి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి జరగకపోగా మద్యం అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని,ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,గజ్జెల శంకర్,చందు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :