Friday, 06 November 2026 09:37:03 AM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 30 May 2026 02:19 PM Views : 677

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ, ఏఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.42 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి పదవీ విరమణ పొందిన ఎస్సై కసిబోయిన సత్యనారాయణ రాజు,37 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సై జంపాల హనుమంతరావు, 41 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ ధారావత్ వెంకటేశ్వర్లు , 36 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి ప్రస్తుతం అశ్వాపురం నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఎట్టా శ్రీనివాసరావు లు శనివారం నాడు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క అనుభవాలను పంచుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పదవీ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చూడాలని కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :