Monday, 02 November 2026 11:40:23 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

సమాచార హక్కు చట్టంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతం – పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 20 December 2025 07:10 PM Views : 562

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (డీఎం సీఆర్ హెచ్‌ఆర్‌డీ) ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ సమన్వయ సమస్త సహకారంతో సమాచార హక్కు చట్టం పై రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యత, చట్టంలోని ముఖ్య నిబంధనలు, పౌరుల హక్కులు, ప్రభుత్వ అధికారుల బాధ్యతలు, సమాచారాన్ని అందించడంలో పాటించాల్సిన విధానాలు, అప్పీల్స్ ప్రక్రియ తదితర అంశాలపై నిపుణులచే సమగ్ర అవగాహన కల్పించారు.శిక్షణ కార్యక్రమం రెండో రోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం అవసరత, పారదర్శకత, బాధ్యతాయుత పాలనలో ఆర్‌టీఐ చట్టం పాత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం అత్యంత కీలకమని, ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధి నిర్వహణలో నిబద్ధతతో అమలు చేయాలని ఆయన సూచించారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.ఈ సమావేశంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కొండలరావు, శిక్షకులు మోహన్ కృష్ణతో పాటు వివిధ శాఖలకు చెందిన మొత్తం 82 మంది ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :