Thursday, 17 September 2026 09:33:37 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రూ.12 కోట్లతో పోస్టాఫీస్-హేమచంద్రాపురం రోడ్డు పనులు.కూనంనేని చొరవతో రోడ్డు అభివృద్ధి పనులకు మోక్షం.

Date : 21 August 2026 08:38 PM Views : 470

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.12 కోట్లతో పోస్టాఫీస్-హేమచంద్రాపురం రోడ్డు పనులు.కూనంనేని చొరవతో రోడ్డు అభివృద్ధి పనులకు మోక్షం.త్వరలో ప్రారంభంకానున్న డబుల్ రోడ్డు నిర్మాణం.సింగరేణి పరిధిలో టెండర్లు పూర్తి.నియోజకవర్గ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి శేషగిరినగర్ మీదుగా హేమచంద్రాపురం వరకు రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ మార్గంలో సింగరేణి భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు తీవ్రంగా ధ్వంసమై, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని సింగరేణి ఉన్నతాధికారులతో ఆయన పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై, పనుల ఆవశ్యకతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన నిరంతర కృషి, పట్టుదలకు సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పనుల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సింగరేణి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని అనుమతులు పూర్తి కావడంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక డబుల్ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా రద్దీ తగ్గడంతో పాటు స్థానిక ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా దుమ్ము, గుంతల సమస్యల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ఎమ్మెల్యే కూనంనేనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోడ్డు నిర్మాణం మరో నిదర్శనంగా నిలుస్తోంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :