Thursday, 05 November 2026 03:56:53 PM
# బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నియోజకవర్గాల వారీగా శిక్షణ

Date : 08 July 2026 05:02 PM Views : 287

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 9, 10 తేదీల్లో మూడు కేంద్రాల్లో నిర్వహణ : డీఆర్‌డీఓ విద్యాచందన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక) రూపకల్పన, అమలుపై జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 9, 2026న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం, ఇల్లందు, వైరా నియోజకవర్గాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు . జూలై 10, 2026న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పట్వారిగూడెంలోని చలికాని ఆదమ్మ ఫంక్షన్ హాల్లో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారీ, గ్రామ అవసరాల గుర్తింపు, ప్రాధాన్యతల నిర్ణయం, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నట్లు డీఆర్‌డీఓ విద్యాచందన తెలిపారు. సంబంధిత నియోజకవర్గాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్ణీత తేదీ, సమయానికి ఆయా శిక్షణా కేంద్రాలకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :