తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి మాట్లాడుతూ సేవా మహిళలు, లేడీస్ క్లబ్ మహిళాలందరూ గోరింటాకు పండగ కార్యక్రమం నిర్వహించడం అభినందించదగిన విషయమని, ఆషాడ మాసంలో గోరింటాకును మహిళలందరూ పెట్టుకోవడం మన సంప్రదాయమని, మహిళల సౌభాగ్యానికి, ఆరోగ్యానికి గోరింటాకు మంచిదని భావిస్తారని, అలాగే శరీరంలోని వేడిని తగ్గించడంలోను గోరింటాకు ఎంతగానో తోడ్పడుతుందని, గోరింటాకు పెట్టుకోవడం అలంకారప్రాయమే కాకుండా వారి నమ్మకాలను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడంలో ఈ కార్యక్రమమును జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి తో పాటు ఇల్లందు సేవా అధ్యక్షురాలు వి.రమ, పద్మజా కోటిరెడ్డి, కొత్తగూడెం సేవా సెక్రటరీ వై.అనిత, కొత్తగూడెం లేడీస్ క్లబ్ సెక్రటరీ సునీత మురళి, సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు, అలాగే ఇల్లందు సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ