Wednesday, 16 September 2026 06:05:03 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి అరెస్టు

Date : 16 October 2025 05:59 PM Views : 376

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ : 08.10 2025న జగ్గారం X రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా TS30TA6498 అనే నంబర్ గల లారీ ఇసుక లోడుతో రాగా దానిని తనిఖీ చేయగా దాని డ్రైవర్ నాతి రాములు వే బిల్లును చూపించినాడు.దానిపై అనుమానం వచ్చి గట్టిగా అడగగా అది నకిలీ వే బిల్ అని దాన్ని తమ ఓనరు హైదరాబాద్ నకు చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చి పంపినాడని తెలిపినాడు.అలాగే రామానుజవరం ర్యాంపులో ఒక వ్యక్తి తనకు డిడి లేకుండా ఇసుక లోడ్ చేసినాడని తెలిపినాడు.దీనిపై లారీని సీజ్ చేసి cr. no. 189/2025 U/Sec 318(4),336(2), 340(2),r/w 3 (5) of BNS, కేసు నమోదు చేయనైనది రామానుజవరం ఇసుక ర్యాంపు నందు తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండిసి కి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్,నాగేల్లి మధు,బుల్లెద్దు అనిల్ అనువారు డిడి లేకుండా ఇసుకను లారీలో లోడ్ చేసినారని అలాగే ఇసుకను లోడ్ చేసే జెసిబి డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ దానిని లోడ్ చేసినాడని అతనికి లోడ్ చేయమని ర్యాంపులో సూపర్వైజర్ గా పని చేసే సతీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినాడని తెలిసినది.అలాగే కర్నాటి శివశంకర్ గురించి తెలుసుకొని హైదరాబాద్ హయత్ నగర్ లోని అతని ఇంటి వద్దకు వెళ్లగా నేరం ఒప్పుకొని వే బిల్లులు తానే తయారు చేసే వాడిని దానికి ఉపయోగించే LAPTAP మరియు ప్రింటర్ అలాగే రామానుజవరం సంబంధించిన స్టాంపును స్వాధీనం చేసుకోవడం జరిగింది. శివశంకర్ తనకు వే బిల్లు తయారు చేయడంలో తన ఊరు సంస్థాన్ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ అనే అతను వే బిల్లులు తయారు చేయడం నేర్పించినాడని,అంతకుముందు కిరణ్ పై 2023వ సంవత్సరంలో నకిలీ వే బిల్లుల తయారు చేసినందుకు వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి జైలుకు కూడా వెళ్లినాడని తెలిపినాడు.తాను కిరణ్ కలిసి పలు రీచ్లకు సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేసి పలుమార్లు ఇసుక అక్రమ రవాణా చేసినామని తెలిపినాడు. అరెస్టు కాబడిన వ్యక్తుల వివరములు A1- కర్నాటి శివ శంకర్ s/o రాములు, 34 సం''లు, గౌడ, లారీ ఓనర్ R/o పుట్టపాక గ్రామం, సంస్థాన నారాయణపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా.. A4).నాతి రాములు, S/o.నరసింహ రావు, 42yrs, గౌడ, డ్రైవర్ , R/o జనగాం గ్రామం, సంస్థాన నారాయణపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా. A5) ఇరగదిల్ల ఉపేందర్ S/o ఎల్లయ్య, 35 years,హిటాచి డ్రైవర్ R/o బ్రాహ్మణపల్లి గ్రామం,మహబూబాబాద్ మండలం&జిల్లా. A6) దగ్గు నిఖిల్ దీప్ S/o రాజేశ్వర్ రావు, 29 years,TGMDC Sand reach Assint. R/o నీరుకుళ్ళ గ్రామం, ఆత్మకూర్ మండలం, హన్మకొండ జిల్లా. A7) నాగేల్లి మధు s/o అమరయ్య, 38 ఇయర్స్,TGMDC Sand reach Assint R/o అమీనపురం గ్రామం, కేసముద్రం మండలం,మహబూబాబాద్ జిల్లా. A8) బోల్లేదు అనిల్ s/o ధర్గయ్య,41 ఇయర్స్,TGMDC Securty గార్డ్ R/o అమీనపురం గ్రామం, కేసముద్రం మండలం,మహబూబాబాద్ జిల్లా. పరారీలో ఉన్నవారు A-2 E.కిరణ్ (వే బిల్లు తయారు చేసిన వ్యక్తి) A-3 సతీష్ రెడ్డి( రామానుజవరం ఇసుక ర్యాంపు) A-9 సుర్వే శ్రీకాంత్ ( లారీ ఓనర్) ఎవరైనా నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేసినా,చేయాలని చూసినా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.ఈ కేసులో ఇంకా కొంతమంది అరెస్టు కావలసి ఉన్నందున ఈ కేసులో ఎవరికైనా ప్రమేయం ఉంటే వారిని అరెస్టు చేయడం జరుగుతుంది.ఈ కేసుకు సంబంధించిన వివరములు గాని నకిలీ వే బిల్లుల గురించిన వివరములు గాని ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే అశ్వాపురం SHO సెల్ No. 8712682093,SDPO మణుగూరు సెల్ నెంబర్. 8712682006 గారిని సంప్రదించగలరు. V.Ravinder Reddy SDPO,Manuguru

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :