Monday, 03 August 2026 05:04:06 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్.

Date : 14 June 2026 06:14 PM Views : 333

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం.ప్రజా సేవలో అలసట లేకుండా పనిచేసిన వ్యక్తి శేషు.బాధిత కార్మిక కుటుంబానికి సిపిఐ, ఏఐటీయూసీ అండగా ఉంటుంది.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. పారిశుద్ధ్య కార్మికుడు గూడూరు శేషు అకాల మరణం అత్యంత బాధాకరమని, సమాజ ఆరోగ్య రక్షణ కోసం శ్రమించే కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మున్సిపల్ అధికారులపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న 56వ డివిజన్ గాజులరాజం బస్తీకి చెందిన గూడూరు శేషు (46) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సాబీర్ పాషా, మూడ్ గణేష్ లు అక్కడికి చేరుకుని నాగయ్య భౌతికకాయాన్ని సందర్శించి, మృతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాగయ్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంతో నిబద్ధతతో, అలసట లేకుండా ప్రజా సేవలో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. నాగయ్య మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగయ్య అకాల మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, తక్షణమే ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం స్పందించి బాధిత కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, పార్టీ పరంగా, మున్సిపాలిటీ పరంగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నివాళులర్పించినవారిలో సిపిఐ పట్టణ నాయకులు మొహమ్మద్ యూసుఫ్, గడ్డం సతీష్ కుమార్, ప్రభాకర్, కార్పొరేటర్ గడ్డం శాంతిప్రియ తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :