Saturday, 01 August 2026 11:50:43 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గోదావరి వరదలపై అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 July 2026 07:52 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి వరదలపై అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం నేపథ్యంలో ముందస్తు చర్యలు ముమ్మరం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, శుక్రవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోదావరిలో నీటి ప్రవాహం నిరంతరం పెరుగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అవసరమైతే మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి అవసరమైతే ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి తదితర అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.గోదావరి స్నాన ఘాట్లు, పర్యాటక ప్రాంతాలు, నది తీర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు నదిలోకి వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ నిరంతర బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహం తగ్గే వరకు నదిలో చేపల వేట, పడవల రాకపోకలు, అనవసరంగా నది వద్దకు వెళ్లడాన్ని నియంత్రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించాలని, వరద పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా నియంత్రణ కేంద్రానికి అందించాలని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.సాయంత్రం 6.00 గంటల నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.40 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43.00 అడుగులు కాగా, ఆ సమయంలో సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :