Friday, 18 September 2026 09:45:36 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్

Date : 07 August 2024 06:35 PM Views : 615

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెండు రోజులు జిల్లా అధికారులందరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని, మిగతా రెండు రోజులు కూడా పూర్తి శ్రద్ధతో, కార్యక్రమాల్లో పాల్గొనాలని, రేపు గురువారం నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఫీవర్ సర్వే జరగాలని అంగన్వాడి ఆశ ఆరోగ్యశాఖ సిబ్బంది జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి జ్వర పిడుతుల వివరాలు సేకరించాలని, ప్రజలను కాచి చల్లార్చిన నీరు తాగాల్సిందిగా తెలపాలని ఎవరికైనా జ్వరం వచ్చి ఉంటే మందులు ఇచ్చి, అవసరమైతే ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లాలని, డెంగ్యూ మలేరియా అనుమాన కేసులకు వెంటనే రక్త పరీక్షలు చేయించాలని ఆదేశించారు.

అదేవిధంగా వనమహోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, హెల్త్ సెంటర్లో, అంగన్వాడి సెంటర్లలో విధిగా ఔషధ మొక్కలైన తులసి,ఇన్సులిన్, రణపాల నేల ఉసిరి,తిప్పతీగ మొక్కలు, మరియు మునగ,కరేపాకు వెలగ,ఉసిరి,, చింత, పనస 100% నాటాలని, జిల్లా కలెక్టర్ పర్యటనలో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉండి ఈ మొక్కలు నాటక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ సిబ్బంది, ఎంపీ ఓలు, ఎంపీడీవోలు, గ్రామాలలో గల వార్డుల వారీగా డాగ్ సర్వే నిర్వహించి, కుక్కల సంతతి నిలుపుదలకు చర్యలు చేపట్టడానికి నివేదిక సమర్పించాలన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా రోడ్ల పక్కన నీరు నిల్వ ఉండే స్థలాన్ని గుర్తించి ఆ నీటిని ఇంకుడు గుంతల ద్వారా నివారించాలని సూచించారు. ఇంకుడు గుంతలు కావలసిన ప్రతిపాదనలు వెంటనే కలెక్టర్ కార్యాలయమునకు సమర్పించాలని ఆదేశించారు.

అదేవిధంగా జిల్లాలోని మెయిన్ రోడ్లలో గోతులు పడ్డచోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసే కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.09-08-24 శుక్రవారం నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వకార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, శుభ్ర పరచాలని వర్షాకాలం వల్ల దోమల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులందరూ చిత్తశుద్ధితో తమ తమ కార్యాలయల పరిసరాలు శుభ్ర పరుచుకోవాలని ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :