తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : "గణేష్ నవరాత్రుల ఉత్సవాలను" ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, మతసామరస్యాన్ని పాటించి, శాంతియుతంగా జయప్రదంగా నిర్వహించాలి!భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్** గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు పోలీసు అధికారులకు విజ్ఞప్తి!విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు కలిసి సహజీవనం చేసే భిన్నత్వంలో ఏకత్వంగా గల మన భారతదేశంలో** అన్ని మతాలను, అన్ని సంస్కృతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాబోవు గణపతి నవరాత్రుల ఉత్సవాలలో, ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని పాటించి, పరమత సహనాన్ని కలిగి ఉండి** ప్రజలకు ఇబ్బంది కలగకుండా, గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకొని** నియమ నిబంధనలతో, నిబద్ధతతో శాంతియుతంగా జయప్రదంగా నిర్వహించాలని*** భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మద్దెల శివకుమార్ సంఘ అత్యవసర సమావేశంలో విజ్ఞప్తి చేశారు.భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం స్థానిక చుంచుపల్లిలోని సంఘ కార్యాలయంలో31 08 2026 నిర్వహించగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ** లౌకికవాదిగా తాను అన్ని మతాలను మత సంస్కృతులను గౌరవిస్తానని** ఈ క్రింది నియమ నిబంధనలను పాటిస్తే 1) చందాల దందాలను బలవంతపు వసూళ్లను చేయకుండా ప్రేమతో గౌరవంతో ఇచ్చిన విరాళాన్ని స్వీకరించి, నిర్వహించాలి.2)ఒక వీధిలో ఒకే విగ్రహాన్ని నెలకొల్పి, ఆ వీధిలో వాహనదారులకు మార్గాన్ని తప్పకుండా చూపించాలి. అంతేగాని ఒక వీధిలో మూడు నాలుగు విగ్రహాలు పెట్టి, ఆ మార్గాన్ని మూసి వేయరాదు.3) రహదారి కూడళ్లలో ( జంక్షన్స్) ఎట్టి పరిస్థితిలోనూ విగ్రహాలను నెలకొల్పరాదు.4) దయచేసి DJ సౌండ్ సిస్టం ను ఏర్పాటు చేయరాదు. ఎందుకంటే బలహీనమైన ఆరోగ్యం గలవారు, ఈ పెద్ద సౌండ్ పొల్యూషన్ తో గుండె ఆగి చనిపోతున్నారు. కాబట్టి మామూలు సౌండ్ సిస్టమ్ ను, మామూలు సౌండ్ తో ఏర్పాటు చేసుకోవాలి.5) గణేశుని మండపాల వద్ద పవిత్రమైన ఆత్మీయమైన భక్తి ప్రపత్తులతో కూడిన వాతావరణాన్ని కలిగించాలి. అంతేగానీ ఉద్రిక్త వాతావరణం గాని, గొడవలతో కూడిన వాతావరణం గాని నివారించాలి.6) ఇక ఆఖరి "నిమజ్జనం "రోజున ట్రాఫిక్కును నియంత్రణ చేసి, ఏ ఏరియా విగ్రహాలను, ఏ మార్గాలలో డైవర్ట్ చేయాలో ఒక ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి.గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు మరియు పోలీస్ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల తన స్వీయ రచనలో వెలువడిన " మన పయనమెటు ?అంతరిక్షంలోక లేక అధహపాతాళం లోకా ""?అన్న కవితలోనిరెండు వాక్యాలను ఈ సందర్భంగా స్మరణకు తెచ్చుకున్నారు.స్వార్ధపరుల చేతిలో ఫ్యాషన్ పావులాగా మారుతున్నది భక్తితత్వం! తన సృష్టి అయిన మానవుని అదుపాజ్ఞ లలోనే విలవిలలాడుతున్నది దైవత్వం""!! తాను అన్ని మతాలను గౌరవించి* "ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము __ఎల్ల మతముల సారం ఒక్కటే, హృదయమే మతము" అనే సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తున్నానని* అయితే మతం కంటే మానవత్వం గొప్పదని** రాద్ధాంతం కంటే సిద్ధాంతం గొప్పదని** ఆచారం కంటేఅమలు గొప్పదని** స్వగతం కంటే సంఘ హితం గొప్పదని** సర్వ మానవ సౌబ్రాతృత్వమే మతం యొక్క అభిమతం కావాలని** ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణిస్తూ** ఆకాంక్షించారు.ఆఖరిగా ఆచార్య డాక్టర్ మద్దెల* అన్ని మతాల ప్రజలకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు , ప్రజాప్రతినిధులకు ,అన్ని ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు , విజ్ఞప్తి చేస్తూ** మతసామరస్యాన్ని పాటించి** అటు గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులకు, ఇటు పోలీసు అధికారులకు సహకారాన్ని అందించి*** మతసామరస్యంతో,శాంతియుతంగా జయప్రదంగా ** ఈ ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోవాలని ఆచార్య డాక్టర్ మద్దెల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ** ఈ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం అత్యవసర సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో బాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్, జిల్లా అధ్యక్షులు మచ్చ పృథ్వీరాజ్,భారతరత్న అంబెడ్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూపతి అశోక్, జిల్లా నాయకులు రాజేశ్వరరావు, శ్రీనివాస్, విజయరాజు, సంతోష్ కుమార్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ