తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : కామేపల్లి మండలం మర్రిగూడెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇల్లందు నుంచి ఖమ్మం వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ