Wednesday, 04 November 2026 12:54:32 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య.. న్యాయమూర్తిపై దాడి పట్ల ఖండన : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 06 October 2025 06:24 PM Views : 566

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయవాది యెర్రా కామేష్ అన్నారు.సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవం కోసం ప్రజలు,సామాజిక ఉద్యమ కారులు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన అమానుష దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని,ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదు,మొత్తం న్యాయవ్యవస్థపై,న్యాయ స్వాతంత్ర్యంపై మరియు రాజ్యాంగ విలువలపై జరిగిన ఘోర దాడి అని మేము ఖచ్చితంగా భావిస్తున్నామని,ఈ దుశ్చర్య న్యాయవృత్తి గౌరవాన్ని దెబ్బతీయడానికి,న్యాయస్వాతంత్ర్యాన్ని క్షీణింపజేయడానికి చేసిన కుట్రగా భావించాలని,మేము దీనిని కఠినంగా ప్రతిఘటిస్తున్నామన్నారు.న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం మనందరి కర్తవ్యమని ప్రజలందరూ న్యాయవ్యవస్థను విశ్వసిస్తూ ప్రజలందరూ నిరసన తెలపాలని కోరారు.న్యాయమూర్తులపై దాడి అంటే,న్యాయం,రాజ్యాంగం,ప్రజాస్వామ్యం పై దాడి.అందువల్ల,న్యాయవృత్తి గౌరవం రక్షణలో మనమందరం ఏకమై నిలుద్దామని,మతోన్మాదుల దుశ్చర్యలు నశించాలని,భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా న్యాయమూర్తిపై దాడి చేసిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :