తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు వేడుకలను జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో ఐడిఓసి మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థిని లను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తు కొరకు నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండాలని, లక్ష్యసాధనలో ఎదుర్కొనే పరిస్థితుల వలన వారు మానసికం గా దృఢం గా ఉంటారు అని తెలిపారు. మరియు క్రీడల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి అని, ప్రతిరోజు చదువుతోపాటు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొనాలి అని తెలిపారు. మరియు బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. మరియు చిల్డ్రన్ హోమ్ మణుగూరు బాలికలకు స్వెటర్స్ మరియు దుప్పట్లు వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగినది. సంతకాల బ్యానర్ పై తమ తొలి సంతకం చేశారు . మూడు విశ్వామిత్ర చౌహాన్ కి జ్ఞాపిక ను ప్రశంస పత్రం అంద జేశారు . రైఫిల్ ఈవెంట్ లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు మరియు మెడల్స్ అందజేశారు . గురుకుల పాఠశాల విద్యార్థినులు బాల్యం వివాహాల పై స్కిట్ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు . ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ( లోకల్ బాడీస్), జెడ్ పి సీఈఓ నాగ లక్ష్మి , జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా , ఇంచార్జ్ DMHO డాక్టర్ ప్రసాద్ , డాక్టర్ తేజస్వి , షీ టీం ఎస్ఐ రమాదేవి , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్ , జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి పరంధామ రెడ్డి , సిడిపిఓ లక్ష్మి ప్రసన్న పాల్వంచ ప్రాజెక్ట్, సిడిపిఓ పద్మశ్రీ కొత్తగూడెం ప్రాజెక్ట్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, సూపరింటెండెంట్ శిరీష మణుగూరు చిల్డ్రన్ హోమ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరికుమారి , వినోద్ , శేషయ్య , సఖి స్టాప్, డి హెచ్ ఇ డబ్ల్యు, చైల్డ్ హెల్ప్ లైన్ స్టాఫ్ , మణుగూరు చిల్డ్రన్ హోమ్ పిల్లలు , పాల్వంచ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ