తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 60వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా నాయకురాలు గూడ విజయ,పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి / గుంపుల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కొత్తగూడెం పట్టణ మాజీ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీధర్ మాట్లాడుతూ సంక్రాంతి అనగానే పిండి వంటలు, ముగ్గుల పోటీలు, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలా మహిళలు వేసే రంగవల్లులకు ప్రముఖ స్థానం ఉన్నదని గత వేల సంవత్సరాల నుండి నిరూపితమై వస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువమంది చిన్నారులు ముగ్గులు వేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది కానీ ఈ కార్యక్రమంలో ఎక్కువగా చిన్న పిల్లలకు పాల్గొనడం చాలా అద్భుతమైన విషయమని అన్నారు వారిని ఎంతో ప్రోత్సహిస్తున్న మాతృమూర్తులకు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది ముగ్గులు అంటేనే రంగవల్లులు ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంద్రధనస్సు లాంటి రంగవల్లులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరీమణునికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరూ గెలిచినట్టే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలతో పాటు ప్రతి ఒక్క సోదరీమణునికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ