తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై టీ. యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దురదపాడు శివారులో గల వాగు నుంచి ఆసుపాక గ్రామానికి రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా మార్గం మధ్యలోని మామిళ్లవారిగూడెం జంక్షన్ వద్ద పట్టుకున్నామన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ