తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 12 (తెలుగు వెలుగు): గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అట్టి సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.ఈ రోజు ఇట్టి కార్యక్రమంలో మొత్తం 07 గురు భాదితులు ఎస్పీ గారిని స్వయంగా కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు.
ఇందులో నలుగురు భాధితులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తమ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసులలో జాప్యం జరగకుండా విచారణ జరిపించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతూ కేసుల వివరాలను ఎస్పీ గారికి తెలియజేసారు.ఒక భాధితురాలు తనను,తన పిల్లలను గత మూడు సంవత్సరాలుగా తన భర్త పట్టించుకోవడం లేదని,తమకు న్యాయం చేయాలని కోరారు.మరో ఇద్దరు భాధితులు ఇటీవల తమ ఇండ్లలో జరిగిన దొంగతనం కేసుల విషయమై దొంగలను పట్టుకుని పోగొట్టుకున్న తమ సొత్తును తమకు అందేవిధంగా చేసి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు.ఈ ఏడుగురు బాధితులు విషయంలో వెంటనే విచారణ చేపట్టి భాధితులకు న్యాయం చేకూర్చాలని సంభంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ