Thursday, 17 September 2026 08:39:55 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

Date : 14 June 2026 06:24 PM Views : 246

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 12 ఏళ్ల కాలంలో ప్రధాని "మోడీ" సాధించిన విజయాలను ప్రచారం చేయాలి. రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. 12 ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయుచున్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రామలింగేశ్వర రావు సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన మాట్లాడారు.12ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలు, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాయన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జిల్లాలో అధికారమే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పని చేస్తామని పేర్కొన్నారు. అయితే భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ పని పూర్తి చేసిన ఘనత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదేమన్నారు. అన్నారు. అంతేగాక ఉజ్వల యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా స్టాండప్ ఇండియా తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ప్రధానమంత్రి మోడీదేనని వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని అమలు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ రాముడి దేవాలయ అభివృద్ధికి రు.98 కోట్ల ఖర్చు చేసిన ఘనత కేంద్రంలో బిజెపి ప్రభుత్వానిదేనన్నారు. అంతేగాక మోడీ చొరవేనని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి గానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. భద్రాచల శ్రీ రాముని ఆలయ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన లేదని విమర్శించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం గత పాలకుల కంటే కూడా ఎంతో ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా జిల్లాకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా అదే పనిగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో చిన్నారిపై ఒక ముస్లిం యువకుడు దారుణానికి వడిగడితే కనీసం స్పందించడానికి మనసు రాని చేతకాని ప్రభుత్వమని విమర్శించారు.ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులని తీవ్రస్థాయిలో విమర్శించారు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మంత్రులు ఎవరు కూడాను నోరు మెదపని పరిస్థితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీని విమర్శించే ప్రభుత్వాలు ఏ విధంగా అధికారానికి దూరమయ్యాయో వివరించారు. ముఖ్యంగా రాబోవు రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, భోగి కృష్ణ, పుణ్యం బిక్షపతి, కార్యదర్శులు తుం పూరిశివ, పుణ్యా నాయక్, ఎస్ఐఆర్ కన్వీనర్ మోహనకృష్ణ,మీడియా కన్వీనర్ రామారావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి దురిశెట్టి కుమార్, మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, పద్మ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :