Monday, 03 August 2026 09:05:44 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా మరియు హైపోథలసేమియా నియంత్రణ కార్యక్రమం

Date : 08 June 2026 06:48 PM Views : 168

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా మరియు హైపోథలసేమియా నియంత్రణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్టేట్ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హైదరాబాద్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలోని డీసీహెచ్‌ఎస్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్లు మరియు వివిధ కార్యక్రమాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో సికిల్ సెల్ అనీమియా మరియు హైపో థలసేమియా కేసుల గుర్తింపు, నివారణ మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు గర్భిణీ స్త్రీలు మరియు వారి భర్తలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ఇద్దరికీ పాజిటివ్‌గా తేలినట్లయితే గర్భస్థ శిశువుకు కూడా తగిన పరీక్షలు చేయాలని తెలిపారు. అదేవిధంగా నవజాత శిశువులకు జననం జరిగిన 48 గంటల తర్వాత సికిల్ సెల్ అనీమియా మరియు హైపో థలసేమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని టీచింగ్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో కొత్త కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే భద్రాచలం, పాల్వంచ, ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు మరియు చర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సికిల్ సెల్ అనీమియా, హైపో థలసేమియా స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ పురోగతిని పర్యవేక్షించాలని, అన్ని డెలివరీ పాయింట్లలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు శిక్షణ అందించి వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రతాప్, డాక్టర్ రాకేష్, డాక్టర్ హరీష్, డాక్టర్ దినేష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :