Thursday, 17 September 2026 10:57:15 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి డివిజన్ కి సమాన బడ్జెట్ కల్పించాలి. మునిగడప పద్మ.

Date : 30 March 2026 06:23 PM Views : 588

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలు మెచ్చిన ప్రజామోదిత బడ్జెట్గా రూపొందించాలి,అభివృద్ధి అంటే రంగుల గ్రాఫిక్స్ కాదు మురికివాడల్లోని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే విధంగా గూడెం బడ్జెట్ ఉండాలి,పన్నుల వసూళ్లలో ఉన్నంత ఉత్సాహం ప్రజలకు సౌకర్యంలో కల్పించడంలో ఉండాలి. ప్రతి డివిజన్ కి సమాన బడ్జెట్ కల్పించాలి.మునిగడప పద్మ. ప్రజలు మెచ్చిన ప్రజా ఆమోదిత బడ్జెట్ గా కొత్తగూడెం కార్పొరేషన్ బడ్జెట్ను ఆమోదించాలని, ఇది అంకెల గారడి, ఊహాజనిత బడ్జెట్ గా ఉండకూడదని 16 వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ మునిగడప పద్మ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోమవారం కార్పొరేషన్ మీటింగ్ హాల్లో మేయర్ మూడు గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026 2027గాను 14 71.49 లక్షల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశ చర్చల్లో కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ అభివృద్ధి అంటే రంగుల గ్రాఫిక్స్ కాదని, మురికివాడల్లోని ప్రజల జీవనం ప్రమాణ స్థాయిని పెంచడమే అభివృద్ధి అవుతుందని ఆమె సూచించారు. బడ్జెట్లోని అంశాలపై మాట్లాడుతూ 2025- 26 నాటికి రూ ..1640. 13 లక్షల ఆదాయాన్ని అంచనా వేసుకొని ది: 31 /1/2026 నాటికి 747.07 లక్షల ఆదాయం వచ్చినట్లు బడ్జెట్లో రూపొందించారని దీని ప్రకారం 893.06 రూ లక్షల రూపాయలు ఆస్తి పన్నులు, ఇతర వాటిపై మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని రాబట్టటంలో వైఫల్యం చెబుతున్నామని ఆమె అన్నారు. కార్పొరేషన్ వ్యాప్తంగా ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నాయని అందులో కమర్షియల్, నాన్ కమర్షియల్ నుండి ఎంత ఆదాయం వస్తుందో సభ్యులకు వివరించాలని ఆమె సూచించారు . నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ లో నాలుగు గ్రామపంచాయతీలు విలీనమయ్యాయని గ్రామపంచాయతీలో పనులకు కార్పొరేషన్ పనులకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఆ వ్యత్యాసాన్ని ఈ బడ్జెట్లో చూపించారా తెలపాలని అన్నారు. 15వ ఫైనాన్స్ నుండి 2025- 26 నాటికి 770- 0 0 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని అంచనా వేసుకొని కేవలం 185. 35 లక్షల రూపాయల మాత్రమే రాబట్టగలిగామని మిగతా నిధులు ఎంత ఎందుకు రాబట్టలేకపోయామని సకాలంలో పనిచేయకన, లేక నిధులు లేకపోవడం కారణం చెప్పాలని ఆమె అధికారులను నిలదీశారు. అలాగే డి ఎం ఎఫ్ టి నిధులు 2025- 26 నాటికి 3100.00 రూ.. ఆదాయాన్ని అంచనా వేసుకొని కేవలం 11 51. 5 0 రూపాయలు మాత్రమే రాబట్టుకోగలిగామని అన్నారు. ఇంకా 1948. 50 రూ ..లక్షలు రావలసి ఉన్నదని ప్రశ్నించారు వాస్తవానికి బడ్జెట్ను పూర్తిగా పరిశీలిస్తే ది 31/1/ 2026 నాటికి 3448.73 రూ లక్షలు ఖర్చును దీంట్లో పొందుపరిచి 31/1/ 2026 నాటికి 2586. 03 లక్షల వాస్తవ ఆదాయాన్ని చూపారని దీన్ని బట్టి ఇంకా 862.70 లక్షల లోటు బడ్జెట్ కనిపిస్తుందని చివరికి మాత్రం 19 67. 80 మిగులు బడ్జెట్ గా చూపించారని దీన్ని బట్టి ఇది ఒక అంకల గారడి, ఊహాజనిత బడ్జెట్ గా ఉందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ కి ఇంటి పన్నులు, కమర్షియల్ టాక్సెస్, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై పన్నులు ద్వారా వచ్చే ఆదాయం మున్సిపల్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉందని, డిఎంఎఫ్టి, ఫైనాన్స్ నిధులు రాకపోతే జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటుందని అన్నారు. కార్పొరేషన్ ప్రజలపై పన్నుల భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమర్షియల్ భవనాల నిర్మించి అద్దెల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని పద్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. 2026- 27 గాను 140 71. 49 లక్షల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టగా కార్పొరేషన్ అభివృద్ధికి దీనిపై వాడి వేడి చర్చ జరిగి సభ్యులు ఆమోదించారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ కార్పొరేషన్ లో ప్రధాన సమస్యలైన పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల సమస్యల పట్ల అధికారులు అలసత్వాన్ని విడనాడి సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు . కార్పొరేషన్ వ్యాప్తంగా కోతులు, కుక్కలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, కోతులు కుక్కులను నివారించడంలో వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి కోతులు, కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని అధికారులను కోరారు. శానిటేషన్ మెరుగుపరిచేందుకు ఒక్కొక్క డివిజన్ కు కార్మికుల సంఖ్యను పెంచాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ నిర్వహణ చేపట్టి పారిశుద్ధ్య మెరుగుపరచాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత తొమ్మిది సంవత్సరాల క్రితం 44 కోట్ల Dmft నిధుల తో కిన్నెరసాని పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని నేటికీ ఆ పైప్ లైన్ మార్గం ద్వారా ఒక్క చెంచాడు నీళ్లు కూడా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి అధికారులు కల్పించాలని దీనిపై ఆలోచన చేయండి అని ఆమె కోరారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి కృషితో రూ.. 25 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా అలాగే మిషన్ భగీరథ ద్వారా రూ ..125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, పనులు చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన అధికారులు ప్రజలకు నీళ్లు అందించడంలో వైఫల్యం చెందుతున్నారని విమర్శించారు. అధికారుల వైఫల్యం కారణంగా ఇటు శాసనసభ్యులకు, అటు ప్రభుత్వానికి మీరు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె అధికారులను హెచ్చరించారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ,పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఎప్పుడు నీళ్లు అందిస్తారో చెప్పాలని ఆమె సభాముఖంగా అధికారులను నిలదీశారు. శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛభారత్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :