Wednesday, 16 September 2026 05:53:08 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

NEET (UG)-2025 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

Date : 02 May 2025 05:04 PM Views : 987

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 02 (తెలుగు వెలుగు) : పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుంది. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న 1176 మంది అభ్యర్థులు. NEET పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న NEET ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు తెలిపారు.జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలయిన కొత్తగూడెంలోని సింగరేణి ఉమేన్స్ కళాశాల,పాల్వంచ లోని TGSWR స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్(girls) మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (KSM) వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించబోయే అధికారులతో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలను చేయడం జరిగింది.

అభ్యర్థులంతా అడ్మిట్ కార్డు నందు సూచించబడిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ???? పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడును. ???? పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ???? పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గానీ,ఆభరణాలను గానీ, షూస్,సాక్స్,బెల్ట్ లు (ఉదా : చెవి దిద్దులు,క్లిప్పులు,రింగులు, మెట్టెలు,చైన్లు మరియు ఇతర ఆభరణాలు మరియు తాళ్ళు,తాయేత్తులు) బ్యాగులు లాంటివి అనుమతించబడవు.ఇలాంటివి ఏమీ లేకుండా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించడం జరుగుతుంది. ???? పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద పురుషులను,స్త్రీలను వేరు వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ????అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, గుర్తింపు కార్డు మరియు రెండు పాస్పోర్ట్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటోను తమ వెంట తప్పనిసరిగా తీసుకొని రావలెను. ???? పరీక్షా కేంద్రాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి. ???? పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదు. ???? పరీక్ష రోజున పరీక్షా కేంద్రాలకి దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు,కంప్యూటర్ సెంటర్లు మూసివేయబడును. ????పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరిని ముందుగానే బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి,పరీక్ష రాసే సమయంలో వీడియోగ్రఫీ చేయబడును. ???? పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు మంచినీటి సౌకర్యం మరియు అత్యవసర వైద్య సేవలకు గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ???? జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న అభ్యర్థుల కొరకు కొత్తగూడెం బస్టాండు,రైల్వే స్టేషన్ మరియు ప్రధాన కూడళ్లలో,బస్సులు ఆగు స్థలాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనుటకై QR కోడ్ ను అంటించడం జరుగుతుంది. ???? అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఎలాంటి పెన్నులు,పెన్సిల్స్ తీసుకురావద్దు.పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ప్రతి ఒక్కరికి బ్లాక్ బాల్ పెన్ ఇస్తారు. ???? పరీక్షకు హాజరయ్య అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లకు సంబంధించిన ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :