తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ను సుజాతనగర్ లోని వారి నివాసంలో సోమవారం పాల్వంచ పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు బాణోత్ బాలు నాయక్, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు రాము నాయక్, లాలు నాయక్, తులసీరాం నాయక్, టెలికం సభ్యులు బోదాస్ కనకరాజు, సీనియర్ నాయకులు కున్సోత్ కిషన్, మంగీలాల్, చంటి, రాజు, కళ్యాణ్, రత్నాకర్ లు శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నా అంటూ సేవా కార్యక్రమాలు చేస్తు అందరివాడిగా పేరున్న నాగా సీతా రాములు ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, అందించే సేవ చేయడంలో మరింతగా ముందుకు సాగాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ