తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ప్రత్తి కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్ పాల్గొని మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు తమ ప్రత్తి పంటను దళారులను నమ్మకుండా సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మోడు గణేష్, ఏఎంసీ చైర్మన్ లాల్ సింగ్ నాయక్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, సీసీఐ బయ్యర్, ఏఎంసీ అధికారులు, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ