Wednesday, 04 November 2026 12:59:51 PM
# మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Date : 15 October 2025 05:44 PM Views : 456

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం :ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.చైతన్యం పేరుతో ఈ రోజు నుండి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలన కోసం వివిధ రకాల అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ చైతన్యం పోస్టర్లను విడుదల చేశారు.ఈ నెల రోజుల పాటు జిల్లా పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు.మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని,వారిలో చైతన్యం నింపేందుకే ప్రత్యేకంగా ఈ కార్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.జిల్లాలోని గంజాయి హాట్స్పాట్స్ లో నిత్యం తనిఖీలు చేపట్టడం,ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం,వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,విక్రయిస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. చైతన్యం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :