తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహించిన ఎ. సుచరిత బదిలీ సందర్భంగా లైబ్రరీ హాల్‌లో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా & సెషన్స్ జడ్జి జి. ప్రేమలత ముఖ్య అతిథిగా హాజరై సుచరిత సేవలను ప్రశంసించారు. అలాగే I అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎస్. సారిత, సీనియర్ సివిల్ జడ్జి-కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి-కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కవిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రవి కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. సుచరిత తమ పదవీకాలంలో న్యాయపరమైన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ, బార్ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున శాలువా, పుష్పగుచ్ఛం మరియు స్మారక చిహ్నంతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షుడు–I (మహిళలు) షేక్ సాజహాన్ పర్వీన్, ఉపాధ్యక్షుడు–II కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేష్, జాయింట్ కార్యదర్శి గడదాసు నాగరాజు, క్రీడా కార్యదర్శి–I బానోత్ దేవదాస్, క్రీడా కార్యదర్శి–II (మహిళలు) నకరాకంటి ఉమ, గ్రంథాలయ కార్యదర్శి దొడ్డా ప్రసాద్, పాల్గొన్నారు. అలాగే సీనియర్ న్యాయవాదులు వై. బాబు రావు, పి. సాంబశివరావు, నాగిరెడ్డి, ఉదయ్ భాస్కర్, వి.వి. సుధాకర్, రమేష్ కుమార్ మక్కడ్, ఎ.రామ్ ప్రసాద్, వెల్లంకి వెంకటేశ్వర్లు, వై. రామారావు, కె. పుల్లయ్య, పురుషోత్తం, జి. రామూర్తి, వేల్పుల సుధాకర్, మహిళా న్యాయవాదులు మనోరమ, సునంద, భానుప్రియ తదితరులు, జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు, బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ