తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు.. ఈ హత్యతో ప్రమేయం ఉన్న సురేష్, పవన్, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, తాజా అరెస్టులతో కలిపి మొత్తం నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ కేసు దర్యాప్తులో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ