తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గండుగులపల్లి క్యాంపు కార్యాలయం నందు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయ్ ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయ్ ఫూలే భారతదేశంలో మహిళల విద్యకు పునాది వేసిన మహనీయురాలని కొనియాడారు తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి బాలికల విద్య కోసం తొలి పాఠశాలను స్థాపించి సమాజంలో అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు పంచారని తెలిపారు మహిళలు చదువుకుని సమాజంలో గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఆమె జీవితాంతం కృషి చేశారని అన్నారు. సమాజంలో సమానత్వం విద్యా హక్కుల కోసం ఆమె చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళల సాధికారత విద్యాభివృద్ధి కోసం ఆమె చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ