తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దరఖాస్తుకు నవంబర్ 5 వరకు చివరి అవకాశం – నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్ టెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత ఫర్నిచర్ తయారీ రంగంలో నైపుణ్యాలను అలవర్చుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. NSTI–FFSC, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మూడు నెలల *“ఫర్నిచర్ అసిస్టెంట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్”*లో పాల్గొనదలచిన అభ్యర్థులు నవంబర్ 5, 2025లోపు క్రింది గూగుల్ ఫారం ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ???? గూగుల్ ఫారం: https://tinyurl.com/4zv2bn67 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 79958 06182, 77994 70817 ఫర్నిచర్ డిజైన్‌లో అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు డ్రాయింగ్ టెస్ట్ నవంబర్ 6, 2025 (గురువారం) ఉదయం 10 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ నవంబర్ 15, 2025 నుండి NSTI–FFSC, హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించబడుతుందని, అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు జిల్లా యంత్రాంగం మరియు CSR సహకారంతో అందజేయబడతాయని ఆయన వివరించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫర్నిచర్ తయారీ రంగంలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ