తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం బేతాలపాడు పంచాయతీకి చెందిన ఆంగోతు సక్రు, కోరం నానయ్య, బల్లెం రంగయ్య అను ట్రాక్టర్ యాజమానులు తమ డ్రైవర్ లైన బానోతు బిక్కు, బానోతు నిఖిల్, సోడే వెంకన్న లతో కలిసి బేతాళ పాడు గ్రామ శివారును గల పెద్ద వాగులో నుండి కూలీల ద్వారా ఇసుకను ట్రాక్టర్లలలో నింపుతుండగా, జూలూరుపాడు పోలీసు వారు మెరుపు దాడి చేసి ,రెండు ఇసుకతో లోడ్ చేసినటువంటి ట్రాక్టర్ను మరియు ఇసుక లోడ్ చేయడానికి రెడీగా ఉన్న మరో ట్రాక్టర్ను పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని, వాహన యజమానులు మరియు డ్రైవర్ల పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాధావత్ రవి కేసు నమోదు చేయడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ