Thursday, 17 September 2026 12:53:40 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు.

Date : 16 December 2025 05:27 PM Views : 439

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు.జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రోహిత్ రాజు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మూడో విడుతలో సమస్యాత్మక,సెన్సిటివ్,హైపర్ సెన్సిటివ్,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పోలింగ్ సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా,గొడవలు,సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలే ప్రసక్తే లేదని,వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఎన్నికల సమయంలో కేసులు నమోదయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు.జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు.ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఊరేగింపులకు,ర్యాలీలకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం,డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని తెలియజేశారు. మూడో విడుతలో మొత్తం 249 పోలింగ్ స్థానాలలోని 1288 పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.సుమారుగా 1500 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.1288 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-619, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-134,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-168,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు-184,మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు-183 లను గుర్తించినట్లు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :