Saturday, 19 September 2026 05:51:55 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరగాలి- జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 03 June 2026 07:49 PM Views : 171

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని, తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్యా సదుపాయాలు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పరిశుభ్రతతో పాటు ఇతర కనీస మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారుఐడీఓసీ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నుండి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సైదులు, సతీష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :