Wednesday, 16 September 2026 05:24:00 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

విజిలెన్స్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి, మారుపేర్లు కార్మికులను వేధించడం సరికాదు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్.

Date : 12 August 2026 06:48 PM Views : 116

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విజిలెన్స్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి, మారుపేర్లు కార్మికులను వేధించడం సరికాదు.కాపర్ ఆరోపణలు ఎదుర్కొన్న విజిలెన్స్ అధికారికి ఘన వీడ్కోలు వేడుకను నిర్వహించిన యాజమాన్యం. మారుపేరు కుటుంబాలపై వేధింపులెందుకు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్.సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్‌ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం డిపెండెంట్లు చేపడుతున్న నిరసన దీక్షకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరాన్ని వంగ వెంకట్‌ సందర్శించారు. దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు.ఎనిమిదేళ్లుగా పెండింగ్‌ మారుపేర్లు, విజిలెన్స్‌ కేసులకు సంబంధించిన కార్మికుల డిపెండెంట్ల ఉద్యోగాల సమస్య గత ఎనిమిదేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగిందని, వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ పెండింగ్‌లో పడిపోయిందన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వంగ వెంకట్‌ తెలిపారు. ఆ హామీతో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు కార్మికులు, ప్రజలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు కాలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నారు.ఉద్యోగాలు కల్పించే అంశంపై అడ్వకేట్‌ జనరల్‌కు లేఖ రాసినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోందని వంగ వెంకట్‌ తెలిపారు. ఏజీ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం యూనియన్‌తో జరిగిన సమావేశంలో స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయశాఖ మంత్రి లేదా అడ్వకేట్‌ జనరల్‌ నుంచి తగిన ఆదేశాలు వచ్చేలా చర్యలు చేపడితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో నిర్వహించిన తొలి స్ట్రక్చర్‌ సమావేశంలోనే ఈ సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. అదేవిధంగా సమ్మె నోటీసులోనూ డిపెండెంట్ల ఉద్యోగాల అంశాన్ని ప్రధాన డిమాండ్‌గా చేర్చామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగాల కల్పనలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు.కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ప్రభుత్వంపై తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు.ఇప్పటికైనా కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.డిపెండెంట్ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని వంగ వెంకట్‌ స్పష్టం చేశారు అనంతరం ఎఐటియుసి నాయకులు నిమ్మరసం అందచేసి దీక్షవిరమణచేయించారు .కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి,బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, గట్టయ్య,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌,సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,భరణి,పిట్ కార్యదర్శులు మధు కృష్ణ ,కమల్,నరేష్, బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు ,నాగయ్యా,గావిని నాగరాజు,మారుపేర్లు–విజిలెన్స్‌ కేసుల కార్మికుల డిపెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :