Thursday, 17 September 2026 06:10:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం క్షమించరానిది. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ధ్వజం.

Date : 16 July 2026 08:30 PM Views : 327

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం క్షమించరానిది.రేవంత్ రెడ్డి చేతకాని పాలన వల్లే ప్రభుత్వ వైద్యం నిర్వీర్యం.మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ధ్వజం. బిఆర్ఎస్ నాయకులతో కలిసి గర్భిణీని పరామర్శ.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా.​కొత్తగూడెం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో నిండు గర్భిణీ నిలబడి డెలివరీ అయిన సంఘటన అత్యంత బాధాకరమని, మనసును తీవ్రంగా చలింపజేసిందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. గురువారం నాడు భారాస ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత గర్భిణీని పరామర్శించి, శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట నుండి పేద మహిళలు నమ్ముకుని ఇక్కడికి వస్తే, కనీసం స్పందించే నాథుడే కరువయ్యారు. నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా, ఒక ఇంజెక్షన్ ఇచ్చి 6 గంటల తర్వాత డెలివరీ అవుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. క్షణాల వ్యవధిలో ప్రసవమయ్యే అవకాశం ఉంటుందని తెలిసి కూడా మహిళా రోగుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? దేవుడి దయ వల్ల, ఆ తల్లిదండ్రుల పుణ్యం వల్ల పాప ప్రాణాలతో బయటపడింది కానీ, ఏ మాత్రం తేడా జరిగినా ఆ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులెవరు?​ గత భారాస ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. నిరంతరం రివ్యూలు చేస్తూ, మందుల కొరత లేకుండా చూశారు. కరోనా వంటి విపత్కర సమయంలోనూ అద్భుత సేవలు అందించారు. కానీ నేడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి చేతకాని పాలన వల్ల ఆసుపత్రుల్లో కనీసం మందులు లేవు, స్కానింగ్ డాక్టర్లు అందుబాటులో లేరు, డయాలసిస్ రోగులు అల్లాడిపోతున్నారు. తాము భారాస కండువాలతో ఆసుపత్రికి వెళ్లగానే, అక్కడి మహిళలందరూ తమ చుట్టూ చేరి గతంలో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు లేవని, మందులు కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను సైతం ఈ ప్రభుత్వం పాడుబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.​కలెక్టర్ వెంటనే రివ్యూ చేయాలి: జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులు నిరంతరం రివ్యూలు నిర్వహించి, పేద ప్రజలకు సక్రమంగా వైద్యం అందేలా చూడాలి. లేనిపక్షంలో భారాస తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ​ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో భారాస ప్రభుత్వం రావడం ఖాయం, అప్పుడే పేద ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. "జై తెలంగాణ.. జై కేసీఆర్" అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో భారాస ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :