Thursday, 17 September 2026 07:37:25 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

డబల్ బెడ్ రూల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. పదో వార్డ్ కౌన్సిలర్ మునుగడప పద్మ

Date : 30 December 2024 08:02 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూముల నిర్మాణం లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారిందని తక్షణమే డబల్ బెడ్ రూమ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ , మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వార్డులో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ల ఎంపిక కేవలం ఎన్నికల కోసం చేసినట్లుగానే ఉందని నిర్మాణాలు పూర్తిగా కాకుండానే డ్రా ఎలా తీసిచ్చారో అయోమయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసాక వారికి ఎలాంటి ధ్రువపత్రం ఇవ్వ కుండా కాగితాల మీద నెంబర్లు వేసి ఇవ్వటం లబ్ధిదారులను మోసం చేసినట్లు కాదా? అని వారు అధికారులను ప్రశ్నించారు. నిర్మాణాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లులకు సర్వే నిర్వహిస్తున్నారని ఈ ఈ సర్వేలో ఇందిరమ్మ ఇల్లులకు అర్హత ఉంటుందో? లేదో? డబల్ బెడ్ రూమ్లు పూర్తయి చేసి చేతికి అందుతుందో? లేదో? అనే సందిగ్ధంలో లబ్ధిదారులు మదన పడుతున్నారని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ తప్పిదాన్ని సరిచేసి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగేలా డబల్ బెడ్ రూమ్ నిర్మానాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఫలానా టైం వరకు అందజేస్తామని లబ్ధిదారులకు జిల్లా అధికారులు భరోసా ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా డబుల్ బెడ్ రూమ్ ల సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని లబ్ధిదారులకు తెలిపారు. ఈ సమావేశంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డి హేమలత , డి నాగమణి, గడిదాస్ కుమార్ స్వామి, వేల్పుల స్వరూప, నాజియా, ఆసియా, నసిం, భరత్, ఎల్లమెల్లి సత్యనారాయణ, భవాని తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :