Wednesday, 16 September 2026 06:01:02 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు అందించడం ప్రభుత్వ లక్ష్యం.

Date : 24 September 2025 08:54 PM Views : 424

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు అందించడం ప్రభుత్వ లక్ష్యం.. రైతుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు మరియు 24 సభ్యుల ప్రమాణ స్వీకారం. 966 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 19 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 19,02,204 రూపాయల చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో అశ్వరావుపేట డివిజన్లో కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ – ఆత్మ కమిటీ రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రైతు సలహా కమిటీ చైర్మన్ మరియు 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, 966 ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, అలాగే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 19 లబ్ధిదారులకు 19, 02,204 చెక్కుల పంపిణీ కార్యక్రమం అశ్వరావుపేట శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు మరియు 24 సభ్యులు నియామక పత్రాలు అందచేసి, అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ పదవికి నియామకం ఒక పెద్దాయనకు న్యాయం చేయడం, రైతుల సంక్షేమం, పేదవర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా మరియు భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టంగా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, గత ప్రభత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త్వరత సుమారు 11 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు, సుమారు 7 లక్షల మంది పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని, ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు సులభంగా అందించబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఎటువంటి ఆర్భాటాలకు పోవటం ఏది చేయగలము ఏది చేయలేము అని అంచనాతో ప్రతి వర్గానికి చెబుతూ పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ఉండేవిధంగా పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా పేదవాడికి పూర్తి మద్దతుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పేదవారికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇల్లు అనేది పేదవారి ఆత్మగౌరమని వారి భరోసా భద్రత కల్పించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారికి అందిస్తున్నామని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం నుండి ఫౌండేషన్ గృహప్రవేశాల వరకు విడతల వారీగా లబ్ధిదారునికి ఖాతాలో నేరుగా ప్రతి సోమవారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేదవారు ఎక్కడా తలదించుకో కూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల పేదవారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ , ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే మొదటిసారిగా అశ్వరావుపేట నియోజకవర్గంలో నిర్వహించబడుతున్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పేదవర్గాల సంక్షేమానికి అవకాశం సృష్టించడం గొప్ప కార్యక్రమం అని అన్నారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన చెక్కుల పంపిణీ ద్వారా పేదవర్గాలకు నేరుగా లబ్ధి చేరడం ముఖ్యమని, ఈ అవకాశాలు రైతుల జీవితాలను సుస్థిరంగా మార్చతాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, ఆత్మ కమిటీ సభ్యులు పంటల, వ్యవసాయ, చేపల పెంపకం మరియు ఇతర సబ్సిడీ స్కీమ్స్ లో నేరుగా లబ్ధి పొందే విధంగా జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో కొత్త వ్యాపార, ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం, సబ్సిడీ స్కీమ్స్ లో పారదర్శకత, ఇళ్ల నిర్మాణ పథకాల్లో సక్రమ పేమెంట్లు, ఫోన్లు, లాగిన్ లో పెండింగ్ వివరాలు పూర్తిగా క్లియర్ చేయడం మొదలైన అంశాలు పేదవర్గాల సంక్షేమానికి ప్రధాన మార్గదర్శకమని కలెక్టర్ తెలిపారు.అనంతరం మంత్రి చేతుల మీదగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :