Wednesday, 04 November 2026 12:36:43 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

గుండాల ఎస్సై రవూఫ్ తమ సిబ్బందితో కలిసి ఈ రోజు పెట్రోలింగ్

Date : 05 May 2025 04:03 PM Views : 986

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుండాల ఎస్సై రవూఫ్ తమ సిబ్బందితో కలిసి ఈ రోజు పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు 1.పాయం రాజేందర్ s/o.లక్షమ్మయ్య, 28 yrs,occ: ప్రైవేట్ జాబ్, r/o నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం. 2.కల్తీ పాపయ్య @సర్పంచ్, s/o గోవింద్ (late), 45 yrs,వ్యవసాయం, r/o ఘణపురం గ్రామం,గుండాల మండలం.అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేసినారు. కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చినాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయినాడు.వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.ఈ రోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొననైనది.నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డియస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటంలో కృషి చేసిన గుండాల సి.ఐ లోడిగ రవీందర్, యస్.ఐ సైదా రావూఫ్,కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును డియస్పి అభినందించినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :