తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వధూవరుల పరిచయ వేదికను తమ కుల బాంధవుల సమక్షంలో ఘనంగా సోమవారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భజన మందిర్ సెంటర్లోని పద్మశాలి కళ్యాణ మండపంలో కొత్తగూడెం నియోజకవర్గ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి సైతం వధువు వరుడు లకు సంబంధించిన కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దాదాపు 60 మంది రిజిస్ట్రేషన్లలో ఆరుగురు మాత్రమే మహిళలు ఉండడం విశేషం. ఎన్నో మ్యారేజ్ బ్యూరోలలో ఎంతో మందికి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి వివాహ సంబంధాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇటువంటి సమయంలో కొత్తగూడెం నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పరిచయ వేదిక అందరికీ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు . అంతేగాకుండా ఇటువంటి పరిచయ వేదికల ద్వారా పద్మశాలి కుల బాంధవులందరూ కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.ఇటువంటి వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా విశేషం అని మెచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు పుట్టా శంకరయ్య, అధ్యక్షులు వేముల ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, సెక్రటరీ మాచర్ల శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ మాదాసి మాధవ్, కార్యవర్గ సభ్యులు వేముల మధుకర్, పరిచయవేదిక కన్వీనర్ వేముల సతీష్, పద్మశాలి సంఘ పెద్దలు చిప్ప శ్రీనివాస్, భోగా నారాయణ, జాగీరపు మల్లేష్, పరిమళ యుగంధర్, మాటేటి అశోక్, బిర్రు నరసింహారావు, ఇమంది హరికృష్ణ సుష్మ, ఇమంది కృష్ణవేణి, ఇమంది గణేష్, కస్తూరి సుధాకర్ మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వధూవరులకు సంబంధించిన తల్లిదండ్రులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ