తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం 12వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఐ డి ఓ సి కార్యాలయం లో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో చైర్మన్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ , జిల్లాకు చెందిన శాసనమండలి, శాసనసభ్యులు, దిశా కమిటీ సభ్యులు మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖలలో చేపడుతున్న పనుల పై నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ